ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది..

– వన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు..బుధవారం వేములవాడ పట్టణంలో బాలానగర్ లో వేములవాడ మున్సిపల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి,వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లతో, ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు..ఈ సందర్భంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ మనం చెట్ల యొక్క ప్రాముఖ్యతను చిన్ననాటి నుంచి పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం…ఇప్పుడు ఉన్నా పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉంది అని అన్నారు. చెట్లను పెంచడం వలన  స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలి,రాష్ట్ర ప్రభుత్వం అటవీ సంపదను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుంది అని వెల్లడించారు. రానున్న రోజుల్లో నీడను ఇచ్చే చెట్లతో పాటు,వన్యప్రాణులకు పండ్లు ఫలాలు ఇచ్చే చెట్లను పెంచుతాం అని అన్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చడం వలన అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు,వన మహోత్సవంలో నాటిన మొక్కలను కాపాడే బాధ్యత మన అందరి బాధ్యత అని తెలిపారు.వేములవాడ పట్టణంలో ప్రతి కాలనిలో పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేల మొక్కలు,పులా చెట్లను నాటాలి అని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్క పౌరుడు  బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్ లు గోలి మహేష్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘ స్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, చిలక రమేష్ తోట లహరి, మున్సిపల్ సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొన్నారు.