నేలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది..

It is everyone's responsibility to protect the soil.– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి గోపాల్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
నేలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి గోపాల్ అన్నారు. గురువారం మండల పరిధిలోని బొల్లెపల్లి గ్రామంలో బొల్లెపల్లి క్లస్టర్ రైతు వేదికలో ప్రపంచ మృతిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  భూసార పరిరక్షణ పరిరక్షణలో భాగంగా భూమిలో సేంద్రియ కర్బన పెంపొందించే విధానాలను  రసాయన ఎరువులు వాడడం వల్ల నేల యొక్క భౌతిక లక్షణాలలో సమతుల్యత దెబ్బతిని నేల యొక్క ఆరోగ్యము చెడిపోవడమే కాకుండా మనుషుల యొక్క ఆరోగ్యము , మొక్కలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కావున నేలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉందని కోరడం జరిగిందనీ,  రైతులు వానాకాలంలో పచ్చి రొట్టె ఎరువులు అయినటువంటి జీలుగ, జనుము, పిల్లి పెసర మొదలగు పప్పు ధాన్యాలను వానకాలం పంటకు ముందే భూమిలో కలియ దున్ని నట్లయితే సేంద్రియ కర్బనం , భూమిలో సూక్ష్మజీవుల లభ్యత వలన మొక్క యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది  ఆరోగ్యవంతమైన నేలను పెంపొందించడం జరుగుతుందనారు.   ఈ యాసంగి పంటలో నారుమడిలో , వరి పంటలో తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ చైర్మన్ రేఖ బాబురావు , అదేవిధంగా భువనగిరి ఏ డి ఏ వెంకటేశ్వర్లు , డాట్ సెంటర్ కోఆర్డినేటర్ అనిల్ , మండల వ్యవసాయ అధికారి  డి మల్లేష్ , వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రియాంక, శ్రీశైలం,  రైతులు పాల్గొన్నారు.