మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది..

నవతెలంగా – భిక్కనూర్
హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండలంలోని సిద్ధి రామేశ్వర నగర్ గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వాటర్ డే సందర్భంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపున నాటిన మొక్కలకు, చెట్లకు గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని పోశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ సౌజన్య, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.