నాగార్జున అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నా సామిరంగ’. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆయన స్వరపరిచిన మొదటి పాట మెలోడియస్ చార్ట్‌బస్టర్ అయితే, టైటిల్ నెంబర్‌గా ఉన్న రెండవ పాట మ్యాసీగా అలరించింది. తాజాగా శుక్రవారం మూడవ సింగిల్ ‘దేవుడే తన చేతితో’ అనే పాటని విడుదల చేశారు నాగార్జున, అల్లరి నరేష్ మధ్య ఉన్న స్నేహం గురించి హదయాన్ని హత్తుకునే పాట ఇది. విజువల్స్ చిన్నప్పటి నుండి వారి బంధాన్ని చూపుతున్నాయి. వారి ప్రయాణం మనసుని కదిలించేలా ఉంది. వారి బంధం చాలా బలంగా ఉంది. చంద్రబోస్ రాసిన సాహిత్యం స్నేహం గురించి గొప్పగా తెలిపింది. శాండిల్య పిసాపాటి అద్భుతంగా ఆలపించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదల కానుంది.