నవతెలంగాణ-బెజ్జంకి: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని సర్పంచ్ దామనపల్లి మంజుల అదివారం ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సర్పంచులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని సర్పంచుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం ప్రత్యేక చోరవచూపాలని సర్పంచ్ మంజుల విజ్ఞప్తి చేశారు.