మరాఠి భాష అస్తిత్వాన్ని కాపాడేల కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరమైన విషయమని మరాఠి భాషిక్ జన కళ్యాణ్ జిల్లా కార్యదర్శి అనిల్ సావ్లే అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓల్డ్ హౌజింగ్ బోర్డులో గల శిశుమందిర్ లో మరాఠి మీడియం ఉపాధ్యాయులను మరాఠి భాషిక్ జన కళ్యాణ్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శాలువతో సత్కరించి సేవలను కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీలో 21 మంది మరాఠి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరాఠి భాషిక్ జన కళ్యాణ్ జిల్లా కార్యదర్శి అనిల్ సావ్లే మాట్లాడుతూ…. ప్రస్తుత కాలంలో మరాఠి మీడియానికి ఆదరణ తగ్గిందన్నారు. ఇలాంటి తరుణంలో పలువురు మరాఠి ఆస్తీత్వాన్ని భవితరాలకు అందించేందుకు డీఎస్సీలో రాణించి ఉద్యోగాలు సాధించడం హర్షణీయమన్నారు. మరాఠి ఔనత్యాన్ని చాటేల మరాఠి సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. భవిష్యత్తులో బేలలో మరాఠి కళాశాల ఏర్పాటు చేసి చేసిన గత ప్రభుత్వానికి ధన్యవాదలు తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తు గతంలో ఎన్నడూ లేని విధంగా మరాఠి మీడియంలో 21 మందినికి నియమించడం హర్షణీయమన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ గుర్నూలే, సుభాష్ రాథోడ్, మనోహర్, విజయ్ బోయర్, శివాజీ, విఠల్, బాపురావ్ ఉన్నారు.