నీతి, నిజాయితిపై పుట్ట మాట్లాడటం హాస్యాస్పదం

– బీఆర్ఎస్ పాలనలో అవినీతి.. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం
– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
నీతి, నిజాయితీపై పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. గురువారం తాడిచెర్ల పిఏసిఎస్ సొసైటీ కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు బుధవారం మదుకర్  మాట్లాడిన అవాస్తవ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.2014 నుంచి 2018 బీఆర్ఎస్ పాలనలో దళితులపై దాడులు, హత్యలు,అవినీతి జరిగాయని, తమ నాయకుడు దుద్దిళ్ల శ్రీదర్ బాబు 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడైనా ఇలాంటి సంఘనలు జరిగాయని ప్రశ్నించారు.కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమ, ప్రజాపాలన కొనసాగితే, బీఆర్ఏఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు,హత్యలు కొనసాగినట్లుగా ఆరోపించారు.రెండేళ్ల క్రితం మండలంలో కొన్ని గ్రామాల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తాడిచెర్ల సొసైటీలో విక్రయిస్తే ధాన్యం డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేశామని గుర్తు చేశారు.రైతులు ధాన్యం సొమ్ము విషయంలో  పిఏసిఎస్ చైర్మన్ రామారావు అవినీతికి పాల్పడిన నేపథ్యంలో సొసైటీ ఉన్నతాధికారులు 51వ విచారణ చేపట్టి సస్పెన్షన్ చేసింది నిజం కాదని ప్రశ్నించారు.. రైతులతో తాము ధర్నాలు చేసిన క్రమంలో రైతులకు చెక్కులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత అవినీతికి పాల్పడిన చైర్మన్ రామారావు, కొందరు బిఆర్ఎస్ డైరెక్టర్లు నిజాయితీ పరులని,వారికి  పుట్ట పాదాభివందనం చేస్తాం అనడం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేసినట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్,పిఏసిఎస్ వైస్ చైర్మన్ ప్రకాష్ రావు, డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు, రమేష్, సమ్మక్క, కాంగ్రెస్ నాయకులు గడ్డం క్రాoతి, చెంద్రయ్య, రావుల ఆంజనేయులు, ప్రభాకర్, బొబ్బిలి రాజు గౌడ్, మేనం సతీష్, మదు పాల్గొన్నారు.