
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇని స్టూట్ ఏసిపి జీ శంకర్ రాజు అన్నారు. సోమవారం అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరోరా పీజీ కాలేజీలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ… వాహన ప్రయాణాలో నిర్లక్ష్యం ప్రాణంతకం గా మారుతొంది అన్నారు. ఇటీవల విడుదల విడుదల చేసిన2022 రహదారి గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. హెల్మెట్, సీటుబెల్ట్ పెట్టుకొని కారణం గా రెండు తెలుగు రాష్ట్ర లలో ఆ సంవత్సరము లో 7,535 మంది ప్రాణాలు కోల్పోగా 17,439 మంది గాయపడ్డారు అన్నారు. రోజు కు సగటు న 21 మంది మృత్యువాత పడగా 48 మంది గాయపడ్డారు అన్నారు.హెల్మెట్ దరించని కారణం గా దేశావ్యాప్తం గా 50,029 మంది మృత్యువాత పడగా అందులో ఆంధ్రప్రదేశ్ లో 6.08% మంది, తెలంగాణ లో 5.92% మంది ఉన్నారు అని తెలిపారు.సీటుబెల్ట్ దరించని కారణం గా దేశవ్యాప్తంగా 16,715 మంది కన్ను మూసారని . అందులో ఆంధ్రప్రదేశ్ లో 5.35% మంది, తెలంగాణ లో 3.79% మంది ఉన్నారని చెప్పారు. దేశావ్యాప్తం గా హెల్మెటు దరించక మరణ్ణిముచిన 50,029 మంది లో 36,692 ( 71.3% ) మంది డ్రైవర్స్, 14,337 ( 28.7% ) మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు.సీటుబెల్ట్ లేని కారణం గా మరణిముచిన 16,715 మంది లో 8,384 ( 50.2% ) మంది డ్రైవర్స్, 8331 ( 49.8 %) మంది ప్రయాణికులు ఉన్నారు అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారుఈ కార్యక్రమం లో అబిడ్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐ సుమన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ చంద్రప్రతిక్,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.