డబ్బు కోసం తీసిన సినిమా కాదు

It is not a movie made for moneyహీరో సూర్య నటిస్తున్న భారీ పీరియాడిక్‌ చిత్రం ‘కంగువ’. శివ దర్శకుడు. దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలక పాత్రధారులు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై కేఈ  జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా  గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో నిర్వహించిన ‘కంగువ’ మెగా ఈవెంట్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ, ‘ఇలాంటి అత్యంత  ప్రతిష్టాత్మ మూవీ చేయటానికి మీ అభిమానం ఓ కారణమైతే, మరో కారణం రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తి’ అని అన్నారు. ‘ప్రతి దర్శకుడికి ఒక ఎపిక్‌ మూవీ చేయాలని ఉంటుంది.  నాకూ అలాంటి అవకాశం ఈ సినిమాతో దొరికింది. బ్యూటీఫుల్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది’ అని డైరెక్టర్‌ శివ చెప్పారు. హీరో సూర్య మాట్లాడుతూ,’వైజాగ్‌తో  మాకు ఎంతో అనుబంధం ఉంది. నేను ఇలాంటి భారీ సినిమా చేసేందుకు నా భార్య జ్యోతిక సపోర్ట్‌ ఎంతో ఉంది. ఈ సినిమా డబ్బు కోసం చేసింది కాదు, మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం’ అని తెలిపారు.