నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చేరికల కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉండటం పార్టీ పంచాయతీ కాదనీ, అది రెడ్ల పంచాయతీ అని కాంగ్రెస్ ఓబీసీ జాతీయ నేత కత్తి వెంకటస్వామి వ్యాఖ్యానించారు. ఈమేరకు గురువారం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలతో వారు కొట్లాడితేనే అది పార్టీ పంచాయతీ అవుతుందన్నారు. పార్టీపైనా, కోమటిరెడ్డిపైనా తీవ్ర విమర్శలు చేసిన అనిల్ కుమార్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి చేర్చుకున్నారనీ, అందుకే వెంకట్‌రెడ్డి దూరంగా ఉన్నారని తెలిపారు.