కాంగ్రెస్‌ నాయకులను విమర్శించడం ఎమ్మెల్యేకు తగదు

– ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకుంటాం
– టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్‌
నవతెలంగాణ-నర్సాపూర్‌
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులు దొంగలు అని. స్థానిక ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించడం తగదని టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్‌ అన్నారు . సోమవారం నర్సాపూర్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి 9 సంవత్సరాల పాలనలో నర్సాపూర్‌ నియోజకవర్గానికి చేసిన అభివద్ధి శూన్యమన్నారు. అభివద్ధి చేయలేని ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నాయకులను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఉచిత విద్యుత్‌ పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలుపరచలేదన్నారు. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావులు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు .ఇకముందు రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఖబర్దార్‌ అని ఆయన హెచ్చరించారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ నాయకులకు స్థానిక ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు . లేని పక్షంలో నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌ గుప్తా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రిజ్వాన్‌, ఓబీసీ సెల్‌ మండల అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌ ,నాయకులు సురేష్‌ నాయక్‌, ఉదరు కుమార్‌ , నరసింహ చారి, రాధాకష్ణ, రషీద్‌, శ్రీశైలం యాదవ్‌, దేవి సింగ్‌, రవిశంకర్‌, వీరేశం గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.