నవతెలంగాణ – కామారెడ్డి
ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనీ టి డబ్ల్యూ జేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించి ఇస్తామని చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలనీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారము కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణమాచారి మాట్లాడుతూ.. ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని, మళ్లీ జరిగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తామనడం సమంజము కాదన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వకుండా మాట తప్పడంపై కామారెడ్డి టి డబ్ల్యూ జె ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారము కచ్చితంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చి మాట నెరవేర్చుకోవాలని లేనిపక్షంలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మోహన్, కృష్ణమూర్తి, ప్రవీణ్ గౌడ్, కరుణాకర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.