కాళేశ్వరం పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డి ఓ జర్నలిస్ట్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదని (ఐజేయు) టీయుడబ్ల్యూజే భూపాలపల్లి జిల్లా కోశాధికారి చింతల కుమార్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలం గాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కమిటీ పక్షాన తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈనెల 26న కాళేశ్వరంలోని మెడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో వార్త కవరేజ్ కు వచ్చిన ఓ జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమాన్నారు. జర్నలిస్టులను చులకనగా చూడటాన్నీ జర్నలిస్ట్ సమాజం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.సదరు జర్నలిస్ట్ పై జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.