విద్యుత్ శాఖ అధికారులపై దుష్ప్రచారం చేయడం సరికాదు

– విద్యుత్ శాఖ భూపాలపల్లి సూపర్ డెంట్ మల్సూరి నాయక్
నవతెలంగాణ – మల్హార్ రావు
మండలంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు వివిధ అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశార., ఈ కార్యక్రమాలు మొత్తం దాదాపు మూడున్నర  గంటల పాటు  కొనసాగాయాని,  కస్తూర్భా ఆశ్రమ పాఠశాలలో జరిగిన కార్యక్రమం  మొత్తం  విద్యుత్  వెలుగులతో జరిగిందని ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని భూపాలపల్లి విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్  మల్చూరు  నాయక్ గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు  33 కె వి  లైన్ లో ఎర్త్  సమస్య తలెత్తడంతో 4 నిమిషాలలోనే  సరఫరాను పునరుద్దరించామని ఆయన అన్నారు.  పని కట్టుకొని కొందరు విద్యుత్ శాఖ పై లేనిపోని నిందారోపణలు చేయడం సమంజసం కాదని, విద్యుత్ శాఖ సిబ్బంది ఆహర్నిశలు శ్రమించి లైన్ ల నిర్వహణ , బ్రేక్ డౌన్స్ , ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు , ట్రిప్పింగ్స్ ను తగ్గించడం వలన  రాష్ట్రంలోనే అత్యదిక పీక్ డిమాండ్ 15623 మెగావాట్ల చేరుకోవడం జరిగిందని తెలిపారు. కావాలని విద్యుత్ శాఖ పై బురద చల్లే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు . అంతరాయాలు లేకుండా వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్  సరఫరా అందిస్తున్నామన్నారు. కాబట్టే అంత డిమాండ్ నమోదు కావడం రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి అన్నారు . అధికారిక  కరెంట్ కోతలు లేవని , విద్యుత్ శాఖ పై దుష్ప్రచారం చేయడం  సరైనది కాదని తెలిపారు . రేయింబవళ్లు విద్యుత్ శాఖ సిబ్బంది కష్టపడి విద్యుత్ వెలుగులు  అందిస్తున్నారని ఇందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు.