కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కార్మికులను విస్మరించడం సరైంది కాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు శనివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆశా వర్కర్ల విస్తృత సమావేశం సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులను కేటాయించకపోవడంతో పాటు, కార్మిక సమస్యల పట్ల వారి వైఖరిని తెలియజేస్తుందని అన్నారు. పెట్టుబడిదారులకు కేంద్రం బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని రాయితీల రూపంలో చెల్లించి కార్మిక వర్గానికి మాత్రం కనీస వేతనాలను అమలు జరపకుండా సౌకర్యాలను పెంచకుండా పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చి నాలుగు కోట్లుగా చేసి కార్మికుల హక్కులను కాలరాసారని విమర్శించారు. అదేవిధంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఆశ వర్కర్లకు అంగన్వాడీలకు మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలను అమలు జరపటంలో కార్మిక చట్టాలను సౌకర్యాలను పెంచడంలో వివక్షతను పాటించి దేశంలో కార్మికుల పట్ల వివక్షతను పాటిస్తుందని హక్కుల కోసం పోరాటమే ఏకైక మార్గమని పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె అన్నారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన అన్ని వర్గాల ప్రజల కార్మిక సమస్యలు పెరిగిపోతున్నాయని పోరాడి సాధించుకున్న చట్టాలను అమలు జరపటంలో కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించటంలో కానీ వివక్షతను పాటిస్తున్నారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సుకన్య, రేణుక, స్వప్న, రమా, సబిత, ఆసియా, పద్మ, రేణుక, సుజాత, దివ్య, శోభ, ఇంద్ర, సాహిర, సలీమా, రాణి, తదితరులు పాల్గొన్నారు.