బీఆర్ఎస్ లో పదవి పొంది పార్టీపై ఆరోపణ చేయడం సరికాదు

నవతెలంగాణ – మిరుదొడ్డి
బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా చేసిన నాయకులు పార్టీలో చిరకాలంగా ఉండాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, జిల్లా నాయకులు లింగం అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో దోహద పడుతుందని అన్నారు. నేడు కొంతమంది స్వార్థ రాజకీయం కోసం రాజకీయ పలు కుబడి కోసం పార్టీని అనవసరమైన ఆరోపణ చేస్తూ పార్టీపై అవార్చన మాటలు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ పేరుతో గెలుపొంది నేడు పార్టీ పరువు తీయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. నేడు ప్రజలు వారికి ప్రజలే బుద్ధి చెప్తారని మండిపడ్డారు. నేడు ప్రజలు కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వానికి  ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని లబ్బి పొందిన నాయకులు నేడు ఇలా ఆరోపణ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల పురం అధ్యక్షుడు తుమ్మల బాలరాజు నంట బాపురెడ్డి కమలాకర్ రెడ్డి సల్లూరి మల్లేశం బైరయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.