నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామంలో గురువారం అధికారులు నిర్వహించిన గ్రామసభపై ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా నిర్వహించడం సరికాదని,ముందస్తుగా గ్రామంలో డప్పు చాటింపు చేయించాలనే నిబంధనలు ఉన్న చేయలేదని లింగన్నపేట మురళి జంబోజు రమణయ్య, తిర్రి రాజేశం, రేవెల్లి లింగయ్య, గిరినేని రాజు, పురుషోత్తం చట్లపెల్లి సమ్మయ్య చింతల మల్లేష్ నక్క బొందయ్య రామచేంద్రం సమ్ము, తో పాటు పలువురు గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామ ప్రత్యేక అధికారి,కార్యదర్శి ప్రజలకు ముందస్తు బహిరంగంగా గ్రామసభపై సమాచారం ఇవ్వకుండా తూతుమంత్రంగా గ్రామసభ నిర్వహించడంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.గ్రామంలో త్రాగునీరు,సీజనల్ వ్యాధులు, విద్యుత్ దీపాలు తదితర సమస్యలపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.