మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంఛార్జి పుట్ట మదుకర్ పై మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అద్యక్షుడు జాగరి హరీష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలపై తమ నాయకుడు ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేయడం సరికాదన్నార. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి సంక్షేమం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై దృష్టి సారించాలే తప్పా, కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులపై నిరాదారమైన ఆరోపణలు చేయడం సరికాదని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఎస్సిసెల్ అధ్యక్షుడు బూడిద సదానందం,ప్రధాన కార్యదర్శి నారమల్ల నవీన్ పాల్గొన్నారు.