జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదు..

It is not right to make false cases against journalists.– తోట్ల మల్లేష్ యాదవ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు)
నవతెలంగాణ – జన్నారం
వాస్తవాలను వెలికితీస్తున్న జర్నలిస్టులను తప్పుడు కేసులు బనాయిస్తూ వేధించడం సరికాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ అన్నారు. జన్నారం మండలంలో ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులతో వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్నారం మండలం మహ్మదాబాద్ సమీపంలోని కడెం ఉప కాలువలో పడి ఉన్న జింక మృత కళేబరం వార్తను ప్రసారం చేసిన రిపోర్టర్ రాజేష్ పై కక్ష్యపూరితంగా వ్యవహరించి తన క్రింది స్థాయి సిబ్బందితో తప్పుడు వార్త అంటూ అసత్య ప్రచారం చేసి ఫిర్యాదు చేయించడం గర్హనీయమని అన్నారు. ప్రభుత్వానికి -ప్రజలకు మధ్య వారధిలా వ్యవహారిస్తూ నిజాలను నిర్భయంగా చెబుతున్న జర్నలిస్టులను తప్పుడు కేసులతో బెదిరించాలనుకోవడం హేయమైన చర్య అని, అసలు అక్కడ ఉన్న జింక కళేబరం ఏమైంది, జింక మృతి గల కారణాలపై అటవీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తు వన్యప్రాణులను రక్షించలేక పోతున్న అటవీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ అధికారులు  జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చెపడాతామని హెచ్చరించారు.