– మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదన్న కారణంతో 163 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రయివేటు కంపెనీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ సర్వే చేయిస్తుంటే, తెలంగాణలో ఏఈవోలపై అదనపు భారాన్ని మోపుతూ వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సస్పెండ్ చేసిన 163 ఏఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిజిటల్ సర్వే ఏఈవోలకు భారం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.