అభివృద్ధి చేయడం మా వంతు..

It is our turn to develop..– చదువు చెప్పడం గురువుల వంతు
– నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి 50 కోట్లు
– మాజీ స్పీకర్ ,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించడానికి గత ఆరు ఏళ్ళలో రూ.50 కోట్లతో 350 నూతన భవనాలు, అదనపు తరగతి గదులు మంజూరు చేశామని, అభివృద్ధి చేయడం ఎమ్మెల్యే ల వంతు విద్యార్థులకు చదువు చెప్పడం ఉపాధ్యాయులవంతుని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సోమవారం బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల  ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిధిగా  మాజీ  స్పీకర్, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి,  రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు  కలసి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రాధమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, రూ. 9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభించి, గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటా..ఆగ్రో చైర్మన్: కాసుల 
ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు నియోజకవర్గం లో అర్హులైన అభ్యర్థులందరికీ పెన్షన్ రేషన్ కార్డు ఐదు లక్షల ఇల్లు నిర్మాణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు నియోజకవర్గం ప్రజలు ఆందోళన గురికాకుండా ప్రభుత్వ నేతలైన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మరియు నేను నియోజకవర్గంలో ఎల్లప్పుడూ అందుబాటులో  ఉంటామని, సమస్యలు ఉన్నవారు నేరుగా మా  ఇరువురి వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అలాగే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధి కి కావలసిన వసతులు సమకూర్చడం ఎమ్మెల్యే వంతు విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించడం ఉపాధ్యాయుల వంతు అని ఆయన సూచించారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉందని గ్రామంలో ఉన్న నాయకులు విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలి అన్నారు ఎవరైతే విద్యార్థుల సంఖ్య పెంచుతారో వారికి పాఠశాలలో ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు. 1998లో ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో చదివిన 28 వేల విద్యార్థులకు గాను 20వేల మంది విద్యార్థులకు ఇప్పటికే ఉద్యోగులు వచ్చాయని ఆయన అన్నారు. విద్యార్థులకు ఈ కళాశాల ఓ కల్పవృక్షమని అని అన్నారు. బాన్సువాడ  నియోజకవర్గానికి 3500 ఇండ్లు ప్రభుత్వం మంజూరు ఇవ్వగా ప్రతి ఆ మిల్ కృషి చేస్తున్నానని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు బాన్సువాడ నియోజకవర్గం ప్రజలు ఎవరు ఆందోళన చెందకుండా పాత కాంగ్రెస్ టిఆర్ఎస్ తనకు మద్దతు ఇచ్చిన వారందరూ ఏదైనా సమస్య ఉంటే తనను నేరుగా కలవాలని మధ్యవర్తి లేకుండా సమస్య పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటికీ రూ. 12 కోట్లతో 110 అంగన్వాడీ భవనాలు నిర్మించామన్నారు. నేను 1994 మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్కటే జూనియర్ కాలేజీ ఉండేది. ఇప్పుడు అన్ని కాలేజీలు కలిపి 40 కాలేజీలు ఉన్నాయి అని అన్నారు సిఎం రేవంత్ రెడ్డి  విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూన్నారని, నియోజకవర్గంలో పాఠశాలల మౌలిక వసతుల కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. డబుల్ బెడ్ రూం నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరలోనే అందుతాయని,  నిజాంసాగర్ ప్రాజెక్టులో 4 టీఎంసీల నీళ్ళు మాత్రమే ఉన్నాయి. అయినా ఎన్ని ప్రయత్నాలు చేసైనా వానాకాలం పంటలకు నీళ్లు ఇస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో లత ఎంపీడీవో, కళావతి ఎంఈఓ నాగేశ్వరరావు ఎంపీపీ రఘు మాజీ ఎంపీటీసీ సందీప్ అంజిరెడ్డి పార్టీ అధ్యక్షుడు శంకర్ కృష్ణారెడ్డి కిష్టాపూర్ గ్రామ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.