
నవతెలంగాణ – మద్నూర్
రైతును రాజు చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేయడంతో రైతులకు రుణమాఫీ వరం లాంటిదని డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృత్వార శ్రీకాంత్ తెలిపారు. రుణమాఫీ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గం లోని డోంగ్లి మండల మల్లాపూర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మల్లాపూర్ గ్రామ ప్రజలు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకలు అమృత్వర్ శ్రీకాంత్, సంతోష్, విట్టల్, వీరేషగొండ, రాజు, హనుమంత్ ఆ గ్రామ యువ నాయకులు పాల్గొన్నారు.