– మాజీ మంత్రి హరీశ్‌రావుపై బీజేపీ ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హిందువుల వారసులం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు అనడం హాస్యాస్పదంగా ఉన్నదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు అన్నారు. మంగళవారంనాడిక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు హిందువులపై దాడులు జరిగినప్పుడు ఏనాడూ ఒక్కర్ని కూడా సదరు మంత్రి పరామర్శించిన దాఖలాలు లేవనీ, అధికారం పోగానే ఆయనకు హిందువులు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హయాంలో హిందువులపై జరిగిన పలు దాడుల్ని ప్రస్తావించారు. ఎన్నికలప్పుడే హిందువులు గుర్తుకురావడం రాజకీయం కాక ఇంకేంటని ప్రశ్నించారు. ఫోన్‌ట్యాపింగ్‌పై గతంలో తానిచ్చిన ఫిర్యాదుపై డీజీపీ స్పందించాలని కోరారు.