మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. బతుకుదెరువు కోసం వెళితే పుత్రశోకం మిగిలిందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాధిత కుటుంబానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు రాజేశం, భూపాల్ గౌడ్, విజయ్ రెడ్డి, భూమా గౌడ్, భూపతి గౌడ్ పలువురు పాల్గొన్నారు.