
– మేడారం అడవుల్లో సుడిగాలికి నేల కూలిన వృక్షాలను పరిశీలించిన పొదెం వీరయ్య
– మేడారం వనదేవతలను దర్శించుకున్న పొదెం వీరయ్య
నవతెలంగాణ – తాడ్వాయి
తుఫాను దాటికి గత నెల 31 వ తారీకు న లక్షల చెట్లు, భారీ వృక్షాలు నేల రాలి, కూలిపోవడం చాలా బాధాకరమని, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. బుధవారం మేడారం అటవీ ప్రాంతాల్లో సుడిగాలికి టోర్నోడో తరహాలో నేల కూలిన లక్షల భారీ వృక్షాలను, కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు బొల్లు రమేష్ కుమార్ ముదిరాజ్, మిగతా కాంగ్రెస్ శ్రేణులు, జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి సందర్శించి, పరిశీలించారు. నష్టపోయిన అటవీ సంపద వివరాలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు జరిగిన ప్రాంతాన్ని డ్రోన్ విజువల్స్ లను చూపిస్తూ జరిగిన నష్టాన్ని అధికారులు అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరయ్య కు వివరించారు. మొదట పోదెం వీరయ్య తాడ్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు బొల్లు రమేష్ కుమార్ ముదిరాజ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ములుగు జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీరయ్యకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పోలెబోయిన సృజన అనారోగ్యంతో ఉండగా ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మాట్లాడుతూ.. నష్టపోయిన అటవీ సంపద వివరాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా కార్యాచరణ చేపడతామన్నారు. ఈ విపత్తు రాత్రి సమయంలో జరిగింది కానీ, పగటి సమయాల్లో జరిగితే రహదారి వెంట మేడారం వనదేవతల దర్శనానికి పోయి వచ్చే భక్తులు, బాటసారులకు గాని నష్టం వాటిల్లేదని వాపోయారు. విపత్తు నుండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన వనదేవత లు సమ్మక్క- సారలమ్మ లను దర్శించుకున్నారు.

గత నెల ఆగస్టు 31 సుడిగాలి కి టోరడో తరహాలో భారీ వృక్షాలు విరిగిపడి, అంత పెద్ద విపత్తు జరిగిన సమ్మక్క సారలమ్మ వనదేవతల వల్లనే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మేడారంలోని వనదేవతలను పొదెం వీరయ్య దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు, మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ లచ్చు పటేల్ లు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. అనంతరం పూజారులు ఎండోమెంట్ అధికారులు పోదెం వీరయ్య కు శాలువాలు కప్పి, ప్రసాదం అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో రాజెంద్రం, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు బొల్లు రమేష్ కుమార్ ముదిరాజ్, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ లచ్చు పటేల్, మాజీ మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాలి కన్నయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్ర కోళ్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముజఫర్, యూత్ నాయకులు బొల్లు నాగేందర్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పాక సాంబయ్య, మాజీ సర్పంచులు సునీల్ దొర, బెజ్జూరి శ్రీను, నాయకులు కోళ్ల వెంకన్న, జాజ శివ, పాక రాజెందర్, వీరిల వెంకన్న, రానా రమేష్, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.