– ఉపాధ్యాయులను సన్మానించడం అదష్టం
– టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిల్ కుమార్
నవ తెలంగాణ-నర్సాపూర్
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఉపాధ్యాయులను సన్మానించడం తన అదష్టమని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్‌లోని చాముండేశ్వరి కళ్యాణ మండపంలో గాలి అనిల్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ హాజరై ఉపాధ్యాయులకు సన్మానించి మెమోంటోలను అందజేశారు ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావించే సంస్కతి మనదని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుందన్నారు. అంతేగాక పాఠశాల తరగతి గదిలోని దేశ భవిష్యత్తు ఉంటుందని ప్రస్తుతం ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు క్రమశిక్షణను నేర్పి వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరే విధంగా చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయు లేనన్నారు. ఉపాధ్యాయులు చేసిన సేవలు మరువలేనివన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, ఎంఈఓ బుచ్చా నాయక్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు సంఘసాని నర్సింగరావు, రాధాకష్ణ గౌడ్, శ్రీశైలం యాదవ్, రషీద్, మల్లేష్ యాదవ్, అజ్మత్ ఉదరు కుమార్ వివిధ మండలాల ఉత్తమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు .