నవతెలంగాణ – చండూరు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో భువనగిరి పార్లమెంట్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి. జహంగీర్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి చేశారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంకోసం కమ్యూనిస్టులను గెలిపించుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. అభ్యుదయ వాదులకు, అవకాశవాదులకు మధ్య ఈ పోటీ కొనసాగుతుందనిఆయన అన్నారు. డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసంఏనాడైనా ఇతర పార్టీలు పోరాటం చేశారనిఅన్నారు. కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని, నేటికీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో భూ పోరాటాలతో పాటు, తాగునీరు, సాగునీరు కోసం అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి సాధించామన్నారు. కేంద్రంలోని ప్రభుత్వానికి నిలదీసి వాటి పరిష్కారం కోసం ఉద్యమించే తత్వం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల బలం ఉన్న కారణంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకోవడంతోపాటు, అటవీ హక్కుల చట్టాన్నిసాధించుకున్నామన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ చట్టాలను తుంగలో తొక్కి, మతోన్మాదాన్ని బీజేపీ ప్రభుత్వంపెంచి పోషిస్తుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెగలు, కులాల మధ్య వైశ్యమ్యాలు రెచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం మనువాదాన్ని తెచ్చేందుకు ప్రయత్నం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కనీస వేతన చట్టాలతోపాటు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పేదల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడంతో పాటు మతోన్మాదాన్ని ఎదుర్కోని లౌకిక వాదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ ప్రయత్నం సీపీఐ(ఎం) మాత్రమే చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో మారుమూల గ్రామాలైన బస్సు సౌకర్యం కోసం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) పార్టీ ముందుండి పోరాటం చేసిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అంతిరెడ్డి, సీపీఐ(ఎం) గ్రామ నాయకులు ఈరటి వెంకన్న, బుర్కల అంజయ్య గౌడ్, ఈరగట్ల స్వామి, బల్లెం స్వామి, కొత్తపల్లి లక్ష్మమ్మ, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.