– కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దూర్‌తాండ, దేవునిపడకల్, పడకల్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన పథకాలను అమలు చేస్తామని తెలిపారు. అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామని మాయ మాటలతో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. పేదలకు ఎంతమందికి ఇండ్లు పంపిణీ చేశారో శ్వేతపత్రం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అర్హులని గుర్తించి పేదలకు ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భగవాన్ రెడ్డి ,కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్ యాదవ్, ఆల్ ఇండియా సేవాదళ్ కార్యదర్శి దశరథం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ,కల్వకుర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ అజీమ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, మండల మైనారిటీ అధ్యక్షులు అరిఫ్ , ఎస్సీ సెల్ చైర్మన్ చెన్నకేశవులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్, దేవునిపడకల్ సర్పంచ్ శ్రీశైలం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ రమేష్ యాదవ్, మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు రమేష్, ఎంపీటీసీలు అంబాజీ, రఘు నాయక్, ఉప సర్పంచ్ అజీజ్, స్టేట్ ఎమ్మెస్ మెంబర్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీ రాములు, తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకుడు డేవిడ్, గ్రామస్తులు కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.