రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయే

కాంగ్రెస్‌ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు
నూతన మండల కాంగ్రెస్‌ కమిటీ ఎన్నిక..
నవతెలంగాణ-రేగొండ
వచ్చే అన్ని ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని, అందుకు నిదర్శనం కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలేనని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్య నారాయణ రావు అన్నారు. శుక్రవారం రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య అధ్యక్షతన అన్ని గ్రామాల ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీి ప్రెసిడెంట్‌ అయిత ప్రకాష్‌ రెడి ఇతర ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం  గండ్ర సత్య నారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ వచ్చే అన్ని ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని జీఎస్సార్‌ అన్నారు. అందుకు ఇటీవల విడుదలైన కర్ణాటక ఫలితాలే నిదర్శ నమన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉందని, ఎంతో మంది త్యాగాలతో కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్రం తెచ్చిం దన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ దేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు. ఇచ్చిన హామీలను అమలుపరచడంలో పూర్తిగా విఫలం చెందిందని దుయ్యబట్టారు. జోడో యాత్ర ద్వారా రాహుల్‌ గాంధీ ప్రజల్లో ఉత్సాహం నింపారని చెప్పారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్రతో దేశంలో మార్పు మొదలైందని పేర్కొన్నారు. అనంతరం మండల నూతన కాంగ్రెస్‌ కమిటీని గండ్ర సత్యనారాయణ రావు, అయిత ప్రకాష్‌ రెడ్డిలు కలిసి సం యుక్తంగా ప్రకటించారు.
కాంగ్రెస్‌ మండల మెయిన్‌ కమిటీ ఎన్నిక
మండల పార్టీ ప్రెసిడెంట్‌గా యిప్పకాయల నర్సయ్య, వైస్‌ ప్రెసిడెంట్లుగా
కౌడగాని తిరుపతి, గుర్రాల రాజిరెడ్డి, ముప్పు శ్రీనివాస్‌, ప్రధాన కార్య దర్శులుగా నాంసాని రాంబాబు, కోలెపాక సాంబయ్య, పెండేల ఉపేందర్‌, పత్తి తిరుపతి, కోశాధికారిగా కడారి జనార్ధన్‌, కార్యవర్గ సభ్యులుగా 37 గ్రామ పంచా యితీల నుండి ఒక్కొక్కరు ఉన్నారు.
యూత్‌ కాంగ్రెస్‌ మండల కమిటీ ఎన్నిక
మండల యూత్‌ ప్రెసిడెంట్‌ గా కనకం రమేష్‌, వైస్‌ ప్రెసిడెంట్లుగా దానవేన రాజ, బోల్లారపు భద్రయ్య, బొజ్జం శ్రీను, ప్రధాన కార్యదర్శులుగా తుమ్మనపెల్లి ప్రేమాజీ, లక్కర్సు వినరు, గోనెల కిరణ్‌, కోశాధికారిగా ముడు తనపెల్లి రాజు, కార్యదర్శులుగా తోట రాజేందర్‌, కర్రే రాకేష్‌, ఒన్నాల శ్రీనివాస్‌, మచ్చిక వేణు, బీసీ సెల్‌ మండల ప్రెసిడెంట్‌గా పోనుగోటి వీరబ్రహ్మం, కిసాన్‌ సెల్‌ మండల ప్రెసిడెంట్‌గా, ఎడ్ల మల్లారెడ్డి, ఎస్సీసెల్‌ మండల ప్రెసిడెంట్‌గా మేకల రవి కుమార్‌, మహిళా కాంగ్రెస్‌ మండల ప్రెసిడెంట్‌గా గంటే శ్యామలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, మహిళా కాంగ్రెస్‌ జిల్లా ప్రెసిడెంట్‌ గుమ్మడి శ్రీదేవి, స్టేట్‌ ఓబీసీ కో ఆర్డినేటర్‌ ఒరంగంటి శంకర్‌, రేగొండ మాజీ ఎంపీపీ తిరుపతిగౌడ్‌, ముఖ్య నాయకులు గూటోజు కిష్టయ్య, సూరం వీరేందర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ వెంపటి భువన సుందర్‌, మండల ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ మేకల రవికుమార్‌, మండల మహిళా కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ శ్యామల, మండల యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ కనకం రమేష్‌, ఎస్టీ సెల్‌ మండల ప్రెసిడెంట్‌ బానోత్‌ రవీందర్‌, రేగొండ మండల ఉప సర్పంచ్‌ గండి తిరుపతి గౌడ్‌, సీనియర్‌ నాయకుడు బుర్ర కొమురయ్యగౌడ్‌లతో పాటు అన్ని గ్రామాల అధ్యక్షులు, తాజా, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, గ్రామ కమిటీ నాయకులు ఉన్నారు.