
నవతెలంగాణ – ధర్మారం
మండలం లోని నర్సింగాపూర్ పత్తిపాక గ్రామాల్లో కూలీలు, వ్యవసాయ కూలీలకు వంద రోజులు ఉపాధి కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకం తీసుకువచ్చి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించిందని ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నారు. మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఉపాధిహామీ పథకం కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెద్ధపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా అమలుచేస్తుందని, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బలపరుస్తున్న ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బద్దం గంగారెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని కనకయ్య, కార్యనిర్వక అధ్యక్షులు స్వర్గం భూమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అరుకొంతం స్వామి రెడ్డి, సురకొంటి మల్లారెడ్డి, కుంటాల సంతోష్, గుండేటి ఆంజనేయులు, నరసయ్య, గోపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి,గుండా రవీందర్ రెడ్డి, అరవింద్,తదితరులు పాల్గొన్నారు.