– మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి..
– ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రుణమాఫీ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఏనాడు చూడలేదని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలో, దేశాయి పేట్ గ్రామంలోని రైతు వేదిక లో ఏర్పాటు చేసిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా రైతుల, కాంగ్రెస్ కార్యకర్తల సంబురాలలో బాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసిన మాజీ స్పీకర్ ,మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు కలిసి పాలాభిషేకం చేశారు. అలగే దేశాయిపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పోచారం, బాలరాజు గారు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు. పాల్గొన్నారు. ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రుణమాఫీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, దేశ వ్యవసాయ విధానంలో తెలంగాణ రాష్ట్రం మాడల్‌గా నిలుస్తుందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక రైతుకు రెండు లక్షల రుణమాఫీ దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదన్నారు. తన జీవితంలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తంచేశారు. ఇదే మొదటిసారి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోనే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇది సాధ్యమైందన్నారు. రైతులందరూ ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు. నేను 2014 నుండి 2018 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేశాం. కానీ ఇందులో రూ. 25 వేల చొప్పున నాలుగు విడతలుగా చేశారు. ఇందుకోసం అప్పుడు రూ. 16,170 కోట్లు ఖర్చు చేశారు. 2018 తరువాత రెండవ విడత ప్రభుత్వంలో రూ. 20,000 కోట్ల రుణాలు ఉండగా రూ. 12,000 కోట్ల వరకు మాత్రమే అందించారు. ఇంకా రూ. 8,000 కోట్లు రైతుల ఖాతాలలో జమ కాలేదన్నారు.
దేశ చరిత్రలో రుణమాఫీ చేయడం మొదటిసారి
కానీ నలబై లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు, రెండు లక్షల రూపాయల వరకు ఒకేసారి అందించడం భారతదేశంలో ఇదే ప్రధమం. ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేయడం మాత్రం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. అందుకే సంబురాలు చేసుకుంటున్నాం. ఈరోజు 11.48 లక్షల మంది రైతులకు లక్ష రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యాయని అన్నారు. ఈనెల చివరి లోపున లక్ష రూపాయల నుండి లక్షా యాబై వేల రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు నగధు అందుతుందన్నారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు15 లోపు రెండు లక్షల రూపాయల రుణాలు ఉన్న రైతుల ఖాతాలలో నగధు జమ చేస్తారని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నాటికి రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఒకే విడతలో రుణాలను మాఫీ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు అని అన్నారు. ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ మే 5న వరంగల్ సభ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మాఫీ చేసి చూపించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు లో ఒకవేళ నీళ్ళు తగ్గితే నేను ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి కొండపోచమ్మ సాగర్ నుండి నీటిని తెచ్చి పంటలను కాపాడుతాం.కాసుల బాలరాజు రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో రైతులకు, పేదలకు అండగా ఉండడానికి నేను బాలరాజు కలిసి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.