బీజేపీకి అంతిమ సంస్కారమే

– ఖలీల్‌ ఉర్‌ రహమాన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీ చేసిన మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఖలీల్‌ ఉర్‌ రహమాన్‌ తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి అంతిమ సంస్కారం చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. అందుకే తమ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.