ప్రభుత్వ కళాశాల భూములు కాపాడాల్సిన భాధ్యత ప్రిన్సిపాల్ దే 

It is the principal's responsibility to protect the government college lands– విద్యార్థి సంఘాల నాయకులు 
నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల లో ప్రైవేటు విద్యా సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనీ, దీనికి నిరసనగా కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు విద్యార్థి సంఘాల నాయకులు కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కాలేజీ భూములకు కస్టోడియన్గా ఉన్న ప్రిన్సిపాల్  దీనిపై వెంటనే స్పందించాలని అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న సరస్వతి శిశు మందిర్ పాఠశాల యాజమాన్యం పై చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఎంతోమంది రైతులు కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దలానే ఆలోచనతో సేకరించిన కళాశాల భూములు ఈరోజు అన్యాక్రాంతం దిశగా వెళ్తున్నాయన్నారు.  విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తు తరాల బంగారు భవితను, పేద బడుగు బలహీన వర్గాల కు ఉన్నత విద్యను అందించడం కోసం ఈ భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వీటి జోలికి ఎవరు వచ్చినా తదుపరి చర్యలకు బాధ్యులవుతారన్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్  వెంటనే స్పందించాలని లేనియెడల విద్యార్థి సంఘాల అగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా భవిష్యత్తు పోరాటాలకు సైతం విద్యార్థి సంఘాలు సిద్ధంగా ఉన్నాయని వాటి పర్యావసానాలు అన్నింటికీ పూర్తి బాధ్యత కస్టోడియన్ గా ఉన్న కళాశాల ప్రిన్సిపాల్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, బివిఎం  రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విటల్,  ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు ముదాం అరుణ్ , టీవీఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ , భరత్, ఫణి, రాహుల్, ప్రియాంక, స్వాతి తదితరులు పాల్గొన్నారు.