నవతెలంగాణ-హైదరాబాద్
దేశ భద్రత పేరుతో భారత నౌకాదళం దామగుండం రిజర్వ్ అడవుల్లో లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎర్త్ లింగ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యుడు పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ… వన్య ప్రాణులు , ఔషధ మొక్కలు , కొన్ని లక్షల చెట్లను నరికి వేస్తూ దామగుండంలో ఈ రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం పర్యావరణాన్ని దెబ్బ తీయడమే , ఒక వైపు దేశంలో ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యానికి (శ్వాస సంబంధిత ) గురౌతున్న ఈ తరుణంలో అడవులను పెంచడం పక్కన బెట్టి ఉన్న సహజమైన వైవిధ్యమైన అడవులను నరికి వేస్తూ రాడార్ స్టేషన్ నిర్మించడం అనేది ప్రజా వ్యతిరేక చర్య , చైనా లాంటి ఇతర దేశాలు ఎదారులను సైతం ఆడవులుగా మారుస్తుంటే కేవలం మన దేశం లో అడవులను నాశనం చేస్తున్నాము , ఇలాంటి ప్రాజెక్టులు ప్రజలు , సైంటిస్టులు , ప్రకృతి ప్రేమికులు వ్యతిరేకించిన ప్రతి సారి ఇది దేశ భద్రత కు సంబంధించింది అని మొత్తం సమస్యనే పక్క దారి పట్టిస్తున్నారు , వందల ఎకరాల అడవిని లక్షల చెట్లను నరికి దానికి కంపెన్సేషన్ కింద మొక్కలు నాటుతాం అని నేవీ అధికారులు అనడం హాస్యాస్పదంగా ఉంది , ఒక మొక్క వృక్షంగా మారడానికి కొన్ని ఏళ్లు పడుతుంది , ఒక అడవిగా ఆహ్ స్థలం మారడానికి వందల ఏళ్లు పట్టొచ్చు , నేవీ అధికారులు పెట్టే ఆ చిన్న చిన్న శోకేజ్ మొక్కలు నిజంగా కంపెన్సేట్ చేస్తాయా? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము . ఒకవేళ రాడార్ స్టేషన్ దేశ భద్రతకు సంబంధించిందే ఐతే మరి అక్కడ నిర్మించే రాడార్ స్టేషన్ వల్ల వచ్చే రేడియేషన్ కు గురయ్యే ప్రజలు ఈ దేశస్థులు కారా? హైదరాబాద్ కు ఆక్సిజన్ ఇచ్చే అడవి ఈ దేశంలో భాగం కాదా? రాడార్ స్టేషన్ కు దేశంలో మరెక్కడైనా చోటు దొరుకుతుంది , కానీ ఈ నేచురల్ ఫారెస్ట్ అనేది కొన్ని వందల ఏళ్లుగా ఉన్న వట వృక్షాలకు వైవిధ్యానికి ఒక పేరు గాంచింది , ఒకవైపు రిజర్వ్ ఫారెస్ట్ అని గుర్తిస్తునే అదే రిజర్వ్ ఫోరేస్టును నేవీ కి అప్పగించడం ఏంటి ? ఇప్పటికే మనం ఇళ్లలో ప్లాస్టిక్ చెట్లను పెట్టుకునే స్థాయికి వెళ్ళాము. ప్రకృతిలో జరిగే విద్వంశలను గుర్తు చేసుకుంటూ అలాంటివి అవ్వకుండా కాపాడుకోవాలంటే అడవులను రక్షించుకోవాలన్నారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటూ తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రావన్ రాకేష్, శాతవాహన యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు లవన్, విక్రాంత్, యువ రచయితలు చందు , ఉదయ్ , స్ఫూర్తి తదితరులు పాల్గొన్నారు