
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల ధన్నూర్ లో శనివారం నాడు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తల్లిదండ్రులకు తెలిపారు. పిల్లలకు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.