నవతెలంగాణ-తిరుమలగిరి
విద్యార్థులను లక్ష్యసాధనగా నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమలగిరి మండల కేంద్రం బాలాజీ ఫంక్షన్ హాల్ లో మండల విద్యాధికారి ఇట్టమల్ల శాంతయ్య ఆధ్వర్యంలో శిల్పి రియల్ ఎస్టేట్ వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్వక మార్పులు తీసుకొచ్చిందన్నారు. సుమారు 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం మనఊరు -మనబడి పేరిట పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకి మెరుగైన బోధనాభ్యసన ప్రక్రియలు కల్పించి విద్యార్థి సర్వతోముఖాభివద్ధికి తోడ్పడాలన్నారు. అవార్డ్ గ్రహీతలు 17 మంది ఉపాధ్యాయు లకు శుభాకాంక్షలు తెలిపి వారిని సన్మానిం చారు. వీరిలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా వేముల బాలరాజు, ఎం జానయ్య కే.ఉపేంద్ర, కె.రమేష్, జి.దుర్గాప్రసాద్ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎస్ డి. దస్తగిరి, వై.మంగతాయామ్మ, వై.అన్నపూర్ణ, ఎం. సైదులు, జి.ఉపేందర్, జి.రవిబాబు ఏ.లింగయ్య, హసీనా ఎం. స్వరూప, ఆర్.యాదగిరి, కే.వెంకటరమణ జె.ఇందిర ఈ సందర్భంగా మండల విద్యాధికారి శాంతయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి అని వారి విధులను వారు గొప్పగా నిర్వర్తించినందుకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగిందని అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వహణకు సహకరించిన శిల్పి రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సురేష్,యాకన్న, సైదులు, రమేష్‌లకు మండల విద్యాధికారితో పాటు సన్మాన గ్రహీతలు కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజిని రాజశేఖర్, ఎంపీపీ స్నేహలత, తహసీల్దార్ రమణారెడ్డి, పంచాయతీ అధికారి మారయ్య, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, పి ఆర్ టి యు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాములు, అశోక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ తిరుమలగిరి పట్టణ అధ్యక్షులు తిరుమని యాదగిరి పాల్గొన్నారు.