లారీ గాని ఆటో గాని ఎదురుపడితే అంతే?

నవతెలంగాణ – శంకరపట్నం
ఒక లారీ గాని ఆటో ఏదురు పడితే అంతే సంగతులని శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామ ప్రజలు మా రోడ్ల పరిస్థితి ఇలా ఉంటుందని తెలిపారు. బుధవారం అంబేద్కర్ చౌరస్తా నుండి ఊళ్లోకి వెళ్లే దారిలోఒక లారీబియ్యం లోడుతో వెళ్తుండగా రోడ్డు ప్రక్కన  దిగబడిపోయి వాహనదారుల రాకపోకలకు అంతరయం కలిగిందన్నారు.మా ఊళ్లో రోడ్డు పరిస్థితి ఇలా ఉందని ఇంతకుముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎన్నో సార్లు వచ్చినప్పుడల్లా ఫిర్యాదు చేసామన్నారు. మా ఫిర్యాదులు చెత్తబుట్టలకే తప్ప రోడ్డు వెడల్పు జరిగిన దాఖలాలే లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక లారీ, ఆటో గాని ఎదురెదురు పడితే అంతే సంగతులన్నారు. అధికారులు  మూడు నెలల క్రితమే రోడ్డు వెడల్పు చేస్తున్నామని చెప్పి ప్రకటనలే చేశారు. తప్ప, ఇప్పటి వరకు  ఆ ఊసే లేదని గ్రామ ప్రజలంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టి రోడ్డు వెడల్పు చేయాలని అంతేకాకుండా ఈ గ్రామంలో రోడ్డు వెంబడి పూరీ ఇల్లు కూలిపోయే దశలో ఉన్నాయని ఈ వర్షాకాలంలో ఆ ఇల్లు కూలిపోతే రోడ్డు కిరువైపులా అంతరాయం కలుగుతుందని ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.