నవతెలంగాణ – సిద్దిపేట
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులైనని పీఆర్టీయూ టి ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి అన్నారు. విపంచికళా నిలయంలో పీఆర్టీయూ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన నూతన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానం విద్యా సదస్సు జరిగింది. జిల్లా శాఖ అధ్యక్షులు మల్లు గారి ఇంద్రసేనారెడ్డి అధ్యక్షత వహించారు. సభకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్ శర్మ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొఠారి చెప్పినట్లు దేశ భవిష్యత్తు పార్లమెంటుగాలో కాదు, నాలుగు తరగతి గదిలోని నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని, దానికోసం అంకితభావంతో ఉపాధ్యాయుల కృషి చేయాలని, యువత ఉపాధ్యాయ రంగం వైపు చూపు పెట్టి రావడం హర్షణీయమని తెలిపారు. తాను గత 25 సంవత్సరాలుగా పీఆర్టీయు సంఘంలో నాయకునిగా, కార్యకర్తగా పనిచేస్తున్నానని, నిస్వార్ధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు విద్యార్థులకు సేవలు అందిస్తున్నానని, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి పీఆర్టియు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీరంతా ఆశీర్వదించాలని ఉపాధ్యాయులను కోరారు. విఎం ఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం, పేద విద్యార్థులకు వస్తువులు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వచ్చే ఆరు సంవత్సరాల నిధులతో కేవలం పాఠశాలలకే ఖర్చు చేస్తానని అన్నారు. అనంతరం నూతనంగా నియమాకమైన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటరాజం , లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆస లక్ష్మణ్, నర్ర భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.