హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులే టార్గెట్‌గా తెలంగాణలో ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఆ పార్టీ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కెఎల్‌ఆర్, బడంగ్ పేట మేయర్, కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహా రెడ్డిల ఇళ్లపై ఇప్పటికే ఐటి దాడులు జరిగాయి.
తాజాగా మాజీ ఎంపి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసాలతోపాటు బేగంపేటలోని వివేక్ కార్యాల యంలో నాలుగు బృందాలు మంగళవారం రాత్రి వరకు సోదాలు నిర్వహించాయి.
కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద మొత్తంలో లావాదేవీ లపై నిఘా పెట్టిన ఇసి అధికారులు… వివేక్ కుటుం బానికి సంబం ధించిన విశాఖ ఇండిస్టీ స్‌కు హెచ్‌డి ఎఫ్‌సి బ్యాంకులో ఉన్న ఖాతాల నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ ఐడిబిఐ బ్యాంకు ఖాతాకు ఈ నెల 13న రూ.8 కోట్లు బదిలీ అయిన ట్లు గుర్తించారు. ఈ లావాదేవీలపై అనుమానంతో సిఇఒ వికాస్‌రాజ్ ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులు ఈ నగదును ఫ్రీజ్ చేశారు.
ఈ నగదుకు సంబంధించి వివరాల సేకరణకు వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు జరిపినట్లు తెలిసింది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్‌లోని వ్యాపారులు, రాజకీయవేత్తల ఇళ్లలో కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహించారు.