ఛాలెంజింగ్‌గా అనిపించింది

It seemed challenging‘నేను సంగీతం అందించిన ‘అమరన్‌, లక్కీ భాస్కర్‌’ సినిమాలు ఈ దీపావళికి విడుదలై, మంచి విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ‘మట్కా’ కూడా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది’ అని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌ అన్నారు. వరుణ్‌ తేజ్‌, కరుణ కుమార్‌ కలయికలో వహిస్తున్న చిత్రం ‘మట్కా’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘డైరెక్టర్‌ కరుణ కుమార్‌కి అద్భుతమైన స్క్రిప్ట్‌ నాలెడ్జ్‌ ఉంది. ఆయనకి ఉన్న డార్క్‌ ఫిలిం మేకింగ్‌ స్టయిల్‌ బ్రిలియంట్‌. ఇది పీరియాడికల్‌ స్టోరీ. మ్యూజిక్‌ కూడా ఆ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండాలి. ఆడియన్స్‌ని ఆ టైమ్స్‌లోకి తీసుకెళ్లాలి. ఈ విషయంలో మాకు చాలా రిస్ట్రిక్షన్స్‌ ఉన్నాయి. మోడరన్‌ సింథ్స్‌ వాడడం కుదరదు. పీరియాడిక్‌ టోన్‌ని క్రియేట్‌ చేయడానికి ఆ తరహా మ్యూజిక్‌ని సృష్టించాలి. అది నాకు బిగ్‌ ఛాలెంజ్‌ అనిపించింది. ఇదొక గ్యాంగ్‌స్టర్‌ ఫిలిం. వైలెన్స్‌, యాక్షన్‌, హై ఎమోషన్‌ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘గాడ్‌ ఫాదర్‌’ తరహా సినిమా. ‘మట్కా’ సినిమా చూశాను. అద్భుతమైన డైరెక్షన్‌, స్టోరీ, పెర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. వరుణ్‌ తేజ్‌ ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. అది స్క్రీన్‌ పై కనిపిస్తుంది. ఇందులో కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మన్స్‌ ఇచ్చారు. ఈ ఏడాది వందో సినిమా చేస్తున్నాను. అయినప్పటికీ నేనొక స్టూడెంట్‌గానే ఫీలవుతున్నాను. మ్యూజిక్‌ అనేది ఒక సముద్రం లాంటిది. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి సినిమా మనకి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతుంది. నా 100 సినిమాల జర్నీ చాలా గ్రేట్‌ జర్నీ. సుధా కొంగరతో నా వందో సినిమా చేస్తున్నాను’ అని అన్నారు.