నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. ఈ వెబ్ సిరీస్ ఈనెల 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ పీరియాడిక్ డిటెక్టీవ్ వెబ్ సిరీస్‌లో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి మీడియాతో సంభాషించారు. ‘నేను పుట్టింది విజయనగరం. పెరిగిందంతా చెన్నై. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. మూడేళ్ళు సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేసి మానేశా. ఆ సమయంలోనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాను. ‘పలాస’ మూవీకి నేను డిజైనింగ్ మాత్రమే చేసిచ్చాను. అయితే ఆహా చేసిన ‘కుడిఎడమైతే’ వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. తర్వాత ‘పారాహుషార్’, ‘కళాపురం’, ‘సర్వం శక్తిమయం’ వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌కు వర్క్‌చేశాను. అలాగే పీపుల్ మీడియా బ్యానర్ సంస్థ నిర్మించిన సిరీస్ ‘హరికథ’కు కూడా వర్క్ చేశాను. ఈ ‘వికటకవి’ సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. అది కూడా పీరియాడిక్ కథాంశం కావటంతో చాలా రీసెర్చ్ చేశాను. 1940 సమయంలో అప్పటి ప్రజల వేషధారణ, సంస్కతి, సాంప్రదాయాల గురించి తెలుసుకున్నాను. టెక్నీషియన్స్‌గా ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. కథకు తగ్గ మూడ్ ప్రకారం ఫ్యాబ్రిక్స్‌ను మార్చాల్సి రావడంతో నాకు పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘మర్మయోగి’, అలాగే ‘మానసచోర’కు ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను’.