– నేడు ఆస్ట్రేలియా మహిళలతో రెండో టి20
– రాత్రి 7.30 గం|| లకు
ముంబయి : తొలి టి20లో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు ఇక సిరీస్‌పై కన్నేసింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి టి20లో భారత్ 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆస్ట్రేలియా మహిళల నిర్దేశించిన 142పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.4ఓవర్లలో స్మృతి మంధాన వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత మహిళలకు ఈ విజయం ఫుల్ జోష్ నింపింది. పేసర్ టితాస్ సద్ధుకి తోడు దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ ఆస్ట్రేలియా మహిళలను కట్టడి చేసిన అత్యద్భుతం. ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అయినా తొలి టి20లోనే టాప్‌సీడ్ ఆస్ట్రేలియాను చిత్తుచేసిన తీరు అత్యద్భుతం. ఇక ఆసీస్ జట్టులో అనుభవజ్ఞుడైన ఎల్లీస్ ఫెర్రీకి ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మంకగా తీసుకోవడంతోపాటు సిరీస్‌ను చేజారకుండా చూసేందుకు ప్రయత్నించే ఛాన్స్ ఉంది.
జట్లు(అంచనా)..
ఇండియా : హర్మన్‌ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్టికా భాటియా, రీచా ఘోష్, అమన్‌జ్యోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, రేణుక, టితాస్ సద్ధు, పూజ వస్త్రాకర్/కనిక అహుజా
ఆస్ట్రేలియా: ఎలీసా హీలీ(కెప్టెన్), బ్రౌన్, గార్డినర్, కిమ్ గ్రాత్, కింగ్, లిచ్‌ఫీల్డ్, తహియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ, ఎలీసా ఫెర్రీ, మెఘన్ స్కట్, సథర్లాండ్/వారేహామ్.