డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములకు పరిహారం అందేలా చూడాలి

 It should be ensured that the houses and lands in the danger zone get compensation– జెడ్పి చైర్మన్ పుట్టకు వినతిపత్రం అందజేత
నవ తెలంగాణ- మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్ల కాపురంలోని బ్లాక్-1 ఓసీపీకి 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు,భూములకు పరిహారం,ఆర్అండ్ఆర్ ప్యాకేజి అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకపోవాలని వార్డు సభ్యుడు బండి స్వామి తోపాటు పలువురు భూ నిర్వాసితులు మంగళవారం తాడిచెర్లలో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర వచ్చిన మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, పేద్దపల్లి జెడ్పి చైర్మన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు పది నెలల క్రితం పిలినరి నోటిఫికేషన్ వేసి,పిఎన్ నోటిఫికేషన్ వేయకుండా రెవెన్యూ, జెన్కో అధికారులు కాలయాపన చేస్తున్నారని చెప్పారు. అధికారులు అలసత్వం వహించడంతో నిత్యం ఓసిపిలో వేస్తున్న బాంబుల దెబ్బలతో ఇండ్లలోకి దుమ్ము,దూళి చేరడమే కాక, ఇంటి గోడలు,ఇండ్లు కూలుతున్నాయని వాపోయారు.ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి నిర్వాసితుల సమస్యలను పరిస్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు.