ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఇబ్బందులు కలగకుండా చూడాలి 

–  జిల్లా కలెక్టర్ హరిచందన  దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునెందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు.సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రక్రియను తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు,అవసరమైన టెంటు, కుర్చీలు, అలాగే తాగునీరు ఏర్పాటు చేయాలని, హెల్ప్ డెస్క్ లో సిస్టం లేదా లాప్టాప్ ఆధారంగా ఎపిక్ ను పరిశీలించి ఓటు వేసే గది ఇతర వివరాలను స్పష్టంగా తెలియజేపాలని ఆదేశించారు.  ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఓటు వేసేలా అవకాశం కల్పించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలోపోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవి తదితరులు ఉన్నారు.