
గ్రామాలలో తాగునీటి ఇత్తడి రాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులను క్వాలిటీ కంట్రోలర్ అధికారి వరప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని ధర్మారెడ్డి తండా, బిజుగం చెరువు తండా, ఇరకుంట తండా లో తాగునీటి సరఫరా పై క్వాలిటీ కంట్రోలర్ అధికారి వరప్రసాద్ తాగునీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ ట్యాంకులలో వచ్చే నీటితో పాటు పిల్లలకు సరఫరా అయ్యే నీటిని గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినోద్ పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ, అనిత ఉన్నారు.