
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఎండాకాలం లో మండలం లోని అయా గ్రామాలలో త్రాగునీరుకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, మండల ప్రత్యెక అధికారి యోహన్ అన్నారు. సోమవారం డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీందర్ ఆద్వర్యంలో 4 నలుగు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల, త్రాగు నీరు, తీవ్రమైన ఎండలు వడగాల్పులు, గ్రామాలలో పారిశుద్ధ్యం అనే నలుగు అంశాలపైన సమీక్ష సమావేశం నిర్వహించి పలు విషయాలపై పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు లకు అవగాహన కల్పించి,పలు సూచనలు, సలహాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శ్రీకాంత్, ఆర్.డబ్లు.యస్. డిప్యూటీ ఈ.ఈ. ధర్మెంధర్, యం.పి.ఓ. శ్రీనివాస్ గౌడ్, అన్ని గ్రామాల స్పెషల్ ఆఫీసర్స్ మరియు పంచాయతి కార్యదర్శులు ఉన్నారు.