కౌలు రైతుల పక్షాన అసెంబ్లీలో ప్రస్తావించాలి

It should be mentioned in the assembly on behalf of the tenant farmers– ఎమ్మెల్యేకు ఆర్ఎస్వి అధ్యక్షుడు బొర్రన్న వినతి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కౌలు రైతులకు ఎల్ఈసి కార్డులతో పాటు, విత్తనాలు కొనుక్కోవడానికి, పంట నష్టపోతే నష్టపరిహారం, వచ్చే విధంగా, తను పంటను అమ్ముకునే విదంగా, రైతులకి రైతు భరోసా నిదులిప్పించే విధంగా శీతకాల సమావేశంలో అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్థావించాలని   రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న  అన్నారు. ఈ విషయమై గురువారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 28763 మంది కౌలు రైతులున్నారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  1లక్ష 17 వేలకు పైగా కౌలు రైతులు ఉన్నారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత 13 సెప్టెంబర్ 2023 సంవత్సరంలో  ఎన్నికల మీనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో భాగంగా  కౌలు రైతులకు రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ అయిపోయిందని రబి సీజన్ ప్రారంభం అయినా ఇంతవరకు కూడా రైతు  భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందన్నారు. 2011 లో కాంగ్రెస్ ప్రభుత్వమే కౌలు సాగుదారులను గుర్తించి ఎల్ఈసీ కార్డులు ఇచ్చేటట్లు భూ ఆదికృత  సాగుదారుల చట్టం తెచ్చి అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వంలో ఈ కౌలు దారి చట్టం అమలు కాకపోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు కార్యక్రమంలో  రైతులు రవి, శుభాష్, దత్తు, కిరణ్  ఉన్నారు.