నవతెలంగాణ – ఆర్మూర్
నేడు అనేక గ్రామాలలో బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు పేదరికంలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం భూమి, ఇండ్లు, ఉపాధి లేనివారు ఎంతమంది ఉన్నారని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని బీసీ ,ఎస్సీ ఎస్టీ, మైనారిటీ జిల్లా అధ్యక్షులు సుంకం భూషణ్ ఆదివారం తెలిపారు . నేడు అనేక గ్రామాల్లో కులవృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీలను ఐక్యం చేసి రాజ్యాధికారం సాధించి వారిలో ఉన్న పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని ప్రభుత్వాన్ని కోరినారు. మైనారిటీ, బీసీ ,ఎస్సీ ఎస్టీలలో పేద ప్రజలు ఎందరో ఉన్నారని,, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారి కుటుంబాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపాలని తెలిపారు.