
-గండిపడిన డీ7 కాలువ ప్రాంతం పరిశీలన
నవతెలంగాణ-బెజ్జంకి
గత యాసంగి కాలంలో రైతుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక చోరవ చూపి సాగు నీరందజేశారని.. ఇటీవల కురిసిన వర్షాల వల్ల డీ7 సాగు కాలువ గండిపడిన సంబధిత గుత్తేదారు మరమ్మతులు చేయిడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని..అధికారులు గండిపడిన కాలువకు మరమ్మతులు చేయించి సాగునీరందించాలని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కోరారు.గురువారం బెజ్జంకి శివారులో గండిపడిన డీ7 కాలువ ప్రాంతాన్ని కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు.వర్షాల్లేక రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని.. గండిపడిన డీ7 కాలువకు మరమ్మతులు చేసి త్వరితగతిన సాగునీరందించేల ఎమ్మెల్యే,సంబధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.నాయకులు చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,రెడ్డి రామకృష్ణ రెడ్డి,రైతులు కరివేద వెంకట్ రెడ్డి,జక్కుల రాజయ్య,పల్లె రాజు పాల్గొన్నారు.