– ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పించిన జెడ్పి సీఈవో రమేష్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామాలలో గ్రామపంచాయతీ పాలకవర్గం లేనందున ప్రత్యేక అధికారులే అన్ని తమై సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని సిద్దిపేట జెడ్పి సీఈవో రమేష్ అన్నారు శుక్రవారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులకు గ్రామాలలో చేపట్టబోయే పనులపై అవగాహన కల్పించారు. గ్రామసభలు, బిల్లుల వసూలు చెల్లింపులపై జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామాలలో పనుల తీరు పర్యవేక్షణ, లైటింగ్, శానిటేషన్ సరిగ్గా చూసుకోవాలన్నారు. సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులు ప్రతి పనిలో ముందుండి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవీందర్ రెడ్డి, డి ఎల్ పి ఓ వీరభద్రం, ఎంపీ ఓ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.